ఇంటర్మీడియట్ బాలికను ప్రేమ పేరుతో వేధించి.. బలవంతంగా పెళ్లి చేసుకొని... అపహరించిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెదవేగి మండలం కే. కన్నాపురం గ్రామానికి చెందిన అనంత్ కుమార్ ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె చదువుతున్న కళాశాలకు వెళ్లి ప్రేమ,పెళ్లి పేరుతో వేధించేవాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తాళికట్టి.. అపహరించాడు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: