పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆత్మహత్యాయత్నం అందుకేనా...!
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని... ఉత్తమ సేవా పురస్కారాలకు వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రమైన ఏలూరు వెళ్లాడు. మరికొద్ది క్షణాల్లో పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉండగా... జాబితాలో తన పేరును తీసివేసినట్లు ఉన్నతాధికారులు వెంకటేష్‌కు తెలిపారు. మనస్తాపానికి గురైన ఆయన... కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. అధికారుల నిర్ణయంతోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన లారీ