ETV Bharat / state

గోదావరి ఉధృతి.. 'పోలవరం' తట్టుకునే దారేది? - undefined

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా... నిర్మితమైన కాఫర్ డ్యాంలు గోదారి ఉధృతిని తట్టుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

పెరుగుతున్న గోదావరి ఉధృతి.. పోలవరంలో ప్రత్యేక చర్యలు
author img

By

Published : Jul 7, 2019, 8:20 PM IST

పెరుగుతున్న గోదావరి ఉధృతి.. పోలవరంలో ప్రత్యేక చర్యలు

గోదావరి వరద ఉధృతి ముప్పుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణంతో గోదావరి వరద ప్రభావం ఎలా ఉండబోతుందనేది అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 60 శాతం పనులు పూర్తైన ఎగువ కాఫర్ డ్యాంను వరదతాకిడికి తట్టుకునేలా చర్యలు చేపడుతున్నారు.

గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గోదావరిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. 25వేల క్యూసెక్కుల వరదనీరు గోదావరిలో కలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే పోలవరం నిర్మాణ ప్రాంతంలో అధికారులు, గుత్తేదారులు, ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. గతంలో వచ్చిన గోదావరి వరదలకు.. ఇప్పటికీ తేడా ఉంది. గతంలో గోదావరికి ఎంత వరద వచ్చినా... సజావుగా ప్రవాహం ఉండేది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. గోదావరి మధ్యలో 35 మీటర్ల ఎత్తుతో కాఫర్​ డ్యాం నిర్మించి... ఇరువైపుల నిర్మించకుండా వదిలేశారు.

కాఫర్ డ్యాం కుడివైపు 2 వందల మీటర్లు, ఎడమవైపు 2 వందల మీటర్ల వెడల్పుతో ఖాళీగా వదిలేశారు. ఈ 400 మీటర్ల పరిధిలోనే గోదావరి నది ప్రవహించాల్సి ఉంటుంది. నదిలో వచ్చిన నీరు డ్యాంను తాకి.. వెనక్కువెళ్లి.. ఇరువైపుల ఉన్న ఖాళీ ప్రాంతాల నుంచి కిందకు వెళ్లాలి. ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహానికైతే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. గోదావరినదిలో ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే వరద వెనక్కు ఎగదన్నే ఆస్కారముంది.

స్పిల్ వే నిర్మాణ ప్రాంతం క్రషర్, మిల్లర్లు, కార్మికుల క్యాంపుల్లోకి వరదనీరు రాకుండా గోదావరి గట్టు ఎత్తును పెంచుతున్నారు. పోలవరం నుంచి రామయ్యపేట వరకు స్పిల్ వే లోనికి గోదావరి వరదనీరు రాకుండా ఎగువున రోడ్డు ఎత్తు పెంచుతున్నారు. గంగానమ్మ మడుగుకొండ నుంచి స్పిల్ వే కొండవరకు గట్లు ఎత్తు పెంచుతున్నారు. స్పిల్ వే ఎగువున ఉన్న కొత్తూరు, కోండ్రుకోట, మాధాపురం గ్రామాల ప్రజలు వరద భయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. గోదావరినదిలో వరద ఉధృతి పెరిగితే.. యంత్రాలు సైతం సురక్షితంగా ఎత్తైన ప్రాంతాలకు తరలించేదుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సిఫార్సుల లేఖలతో సర్కార్ బడి ఎదుట క్యూ

Intro:ap_gnt_81_07_praive_vaidhyasaalalo_rogi_mruthi_bandhuvula_aandholana_avb_ap10170

ప్రయివేట్ వైద్యశాలలో రోగి మృతి. బంధువుల ఆందోళన.

పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన జీనేపల్లి తిరుపతయ్య(46) అనే వ్యక్తి గత నాలుగు రోజుల క్రితం నరసరావుపేట పట్టణంలోని శ్రీ దత్త ప్రయివేట్ వైద్యశాలలో గుండె జబ్బుతో బాధ పడుతూ మెరుగైన వైద్యం కోసం చేరారని బంధువులు తెలిపారు.

Body:అయితే రోగికి ఎటువంటి ఇబ్బంది లేదు మేము బాగుచేస్తామని వైద్యులు నమ్మించి వైద్యం కోసం సుమారు లక్షన్నర ఫీజు వసూలు చేశారన్నారు. వాల్స్ కు రెండు స్టెంట్స్ వేసి చికిత్స చేశారని తెలిపారు. అయినప్పటికీ తిరుపతయ్య వైద్యశాలలో మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు ఎటువంటి ఇబ్బంది లేదని మమ్మల్ని నమ్మించి చివరకు రోగి మృతదేహాన్ని అప్పగించారంటూ మృతుని బంధువులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగారు.

Conclusion:వైద్యశాల ఎదుట బైఠాయించి వైద్యుల నిర్లక్షంతోనే తమ వ్యక్తి మృతి చెందాడని బంధువులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు వైద్యశాల వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మృతుని బంధువులతో మాట్లాడి పరిస్థితి ని చక్కదిద్దారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.