ETV Bharat / state

మహాత్ముడు నాటిన మొక్క... ఏలూరుకు నీడ

మారణాయుధాలు చేతపట్టకుండానే... సత్యం, అహింసా మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన ఘనత బాపూజీది. గాంధీజీ మాటలు, చేతలు, ఉద్యమం... దేశానికి ఎన్నటికీ చిరస్మరణీయం. మహాత్ముడి మార్గాలు అనుసరణీయం. అలనాటి శాంతిస్వరూపుడి గుర్తులు... ఇప్పటికీ తెలుగు నేలను పునీతం చేస్తున్నాయి.

gandhiji slaped tree at westgodari district
author img

By

Published : Oct 2, 2019, 6:32 AM IST

మహాత్ముడు నాటిన మొక్క... ఏలూరుకు నీడ
సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణానికి బాపూ 1921లో వచ్చారు. శ్రీ మార్కండేయ ఆలయంలో చిన్న పిల్లలకు విద్యాభ్యాసం చేయించి... కెనాల్ రోడ్​లో శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత కొంతకాలం బ్రిటిష్ పాలకులు ఆ పాఠశాలలో కార్యకలాపాలు నిలిపివేశారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో భాగంగా గాంధీజీ 1934లో మళ్లీ ఏలూరు వచ్చారు. ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ఆ సమయంలో పాఠశాల ఆవరణంలో మేడి చెట్టు నాటారు. ఆ చెట్టు ఇప్పటికీ గాంధీజీ జ్ఞాపకంగా ఉంది. ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ... ఎంతోమంది విద్యార్థులకు విద్యనందిస్తోంది. మహాత్ముడు నాటిన మొక్కను పరిరక్షించుకుంటూ... బాపూ జ్ఞాపకాన్ని పదిలం చేస్తున్నారు జిల్లా వాసులు.

Intro:ap_atp_61_01_neetilopadi_balika_mruthi_ap10005&97
______________*
నీటి మడుగులో పడి విద్యార్థి దుర్మరణం
-----*
మరో ఇద్దరు చిన్నారులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం
--------------*
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఊరి చివరన ఉన్న నీటి మడుగులో పడి అస్మిత(13) 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని దుర్మరణం పాలైంది. అస్మిత తోపాటు శాలిని (13), చిన్ని (13) అనే ఇద్దరు విద్యార్థులు ఊరి చివరన ఉన్న తోట కు వెళ్లారు. అక్కడ దాహం వేయడం తో నీటి మడుగు దగ్గరకు వెళ్లారు. నీళ్లు తాగడానికి మడుగులో దిగిన అస్మిత ప్రమాదం లో చిక్కింది. అస్మిత ను చూసిన తోటి విద్యార్థులు కూడా మడుగులోకి దిగారు. నీళ్లలో తెలియాడుతూ కేకలు వేస్తూ కనిపించిన ఇద్దరిని అటుగా వెళుతున్న స్థానికులు కాపాడగా, అప్పటికే మునిగిపోయి మృతిచెందిన అస్మిత మృతదేహం బయటికి తీశారు. ముగ్గురు విద్యార్థినిలు ఒకే తరగతి చదువుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నీటి మడుగులో పడి ప్రమాదానికి గురికావడం గ్రామంలో విషాదాన్ని నింపిందిి. ఇటీవల వారం నుంచి పోలీస్ అధికారులు పిల్లల్ని బయటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారిపై ఓ కన్నేసి ఉండాలని సూచనలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నా ఈ సంఘటన చోటు చేసుకోవడం విచారకరం.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.