ETV Bharat / state

ప్రభుత్వం రాయితీ ఇచ్చినా.. ఆక్వా రైతులకు దక్కని భరోసా - రొయ్యల సాగులో విద్యుత్ కష్టాలు

ఒకప్పుడు రొయ్యల సాగు అంటే డాలర్ల పంటగా ఉండేది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వారు. కొన్నేళ్లుగా సాగు ఖర్చులు పెరిగాయి. అనేక ఒడుదొడుకులతో సాగుదారులు కుదేలవుతున్నారు. ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించినా.. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా తీరని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

ప్రభుత్వం రాయితీ ఇచ్చినా..ఆక్వారైతులకు దక్కని భరోసా
author img

By

Published : Oct 29, 2019, 12:33 PM IST

Updated : Oct 29, 2019, 3:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు అప్రకటిత విద్యుత్​ కోతలతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం విద్యుత్​ రాయితీని ప్రకటించినా... అప్రకటిత కరెంటు కోతలు తమకు ఇబ్బందిగా మారాయని వాపోతున్నారు.

ఆక్వా రైతులు విద్యుత్ కష్టాలు...

ఒక ఎకరం రొయ్యల చెరువుకు ఒక గంట విద్యుత్తు లేకపోతే పంకాలు తిప్పడానికి 1.5 లీటర్ల డీజిల్‌ అవసరం.

ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర రూ. 72. దీని ప్రకారం రూ. 108 ఖర్చవుతోంది.

జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.

అంటే జిల్లాలోని చెరువులన్నింటిలో ఒక గంట డీజిల్‌ ద్వారా పంకాలు తిప్పాలంటే రూ. 97.20 లక్షలు ఖర్చవుతుంది.

గంటసేపు పంకాలు తిప్పటానికి 15 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది.

దీని ఖరీదు రూ. 23. జిల్లాలోని చెరువుల్లో ఒకగంట విద్యుత్తు ద్వారా పంకాలు తిప్పినందుకు చెల్లించేది రూ.20.70 లక్షలు మాత్రమే.

దీన్ని బట్టి విద్యుత్తు కోతల కారణంగా ఆక్వా రైతులపై పడే ఆర్థిక భారాన్ని అర్థం చేసుకోవచ్చు

ప్రభుత్వ ఉత్తర్వులతో ఆనందం

ఆక్వా సాగుదారులను ఆదుకోవాలని ప్రభుత్వం విద్యుత్తు రాయితీపై నిర్ణయం తీసుకుంది. విపక్ష నేతగా గతేడాది జిల్లాలో పాదయాత్రలో ఆక్వారైతులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది జులైలో యూనిట్‌ విద్యుత్తు రూ. 1.50కి సరఫరా చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఏటా ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయాన్నిస్తున్న ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆక్వా రైతులు సంబరపడ్డారు.రాయితీతో జిల్లాలో ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతుందని విద్యుత్తు శాఖ అధికారుల అంచనావేశారు.

నిరంతరాయంగా సరఫరా చేస్తేనే భరోసా

అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తేనే ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో ప్రయోజనం కలుగుతుందని ఆక్వారైతులు భావిస్తున్నారు. ప్రధానంగా రొయ్యల సాగుకు విద్యుత్తు తప్పనిసరి. రొయ్యలకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌) అందించేందుకు సాగు చెరువుల్లో ఏర్పాటు చేసే పంకాలను (ఏరియేటర్లను) రోజంతా తిప్పుతూనే ఉండాలి. అప్రకటిత విద్యుత్తు కోతలతో జనరేటర్లకు, డీజిల్‌కు అధిక వ్యయం అవుతోందని ఆక్వారైతులు చెబుతున్నారు. అప్రకటిత విద్యుత్తు కోతలతో రోజూ 2 గంటల నుంచి 3 గంటల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం

అధికారికంగా విద్యుత్తు కోతలు జిల్లాలో ఎక్కడా లేవు. ట్రాన్‌ఫార్మర్లు, బ్రేక్‌డౌన్‌ సమస్యలు కూడా లేవు. కాల్‌సెంటర్లకు ఫిర్యాదులు రాలేదు. అప్రకటిత విద్యుత్తు కోతలు ఇటీవల వర్షాలు కురిసినప్పుడు జరిగాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి

అధికారులూ... చర్యలు చేపట్టరా...?

Intro:Body:

dummy for news

Conclusion:
Last Updated : Oct 29, 2019, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.