పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఓ రెవెన్యూ అధికారిణి సౌజన్య రాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసేందుకు రూ.3 వేలు నగదు తీసుకుంటుండగా అనిశా వలపన్ని పట్టుకుంది.
ఇదీ జరిగింది..
భీమడోలు గ్రామానికి చెందిన చోడిశెట్టి సత్యనారాయణ అనారోగ్యంతో చనిపోయాడు. అతని భార్య బేబీ భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి... ఆర్.ఐ. సౌజన్య రాణిని అభ్యర్థించింది. సర్టిఫికేట్ మంజూరు చేయాలంటే... రూ.10 వేలు లంచం ఇవ్వాలని రెవెన్యూ అధికారిణి డిమాండ్ చేసింది. తనకు అంత ఆర్థిక స్థోమత లేదని... భర్త చనిపోయి పిల్లల పోషణకు ఇబ్బంది అవుతుందని ఆర్.ఐ సౌజన్యకు బేబీ చెప్పినా పట్టించుకోలేదు. చివరికి బాధితురాలు చేసేదేమి లేక... రూ.3 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆర్ఐ దేవికారాణిని పట్టుకున్నారు.
ఇవీ చదవండి: