పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో గ్రామస్థులు పాఠశాలను చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. నిజానిజాలను విచారించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. నిందితుణ్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి: