విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన బియ్యం నాసిరకంగా ఉన్నాయంటూ... విజయనగరం జిల్లా పార్వతీపురంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం... పురుగులు పట్టి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో... విద్యాశాఖ అధికారి కృష్ణారావు తల్లిదండ్రులతో చర్చించారు. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
ఇదీ చదవండి : రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలివే..!