కళాశాల అధ్యాపకుడు.. వందసార్లు రక్తదానం చేశాడు.. - విజయనగరంలో 100 సార్లు రక్తదాన చేసిన అధ్యాపకుడు
రక్తదానంలో.... విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యాపకుడు గుప్త సెంచరీ కొట్టారు. 1993లో తొలిసారి రక్తదానం చేసిన ఆయన అప్పటి నుంచి ఎవరికి రక్తం అవసరమని తెలిసినా నేనున్నానంటూ ముందుండేవారు. ఏటా సరాసరిన 4 సార్లు రక్తదానం చేసేవారు. గత సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా... విజయనగరం ప్రాంతీయ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో వందోసారి రక్తదానం చేశారు. ఆసుపత్రి వైద్యులు, రక్తనిధి కేంద్రం అధికారులు గుప్తను అభినందించారు.
Intro:ap_vzm_37_11_100_sarlu_rakta danam_avbbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 రక్తదానం లో ఆయన సెంచరీ కొట్టారు రెండు దశాబ్దాలకు పైగా రక్తదానం చేస్తూ ఎంతోమందికి ప్రాణదాత గా నిలిచారు
Body:వంద సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు ఎవరికి ఎప్పుడు రక్తం అవసరం ఉన్న నేనున్నానంటూ ముందుకు వచ్చారు విజయనగరం జిల్లా లో ఎయిడెడ్ కళాశాల అధ్యాపకుడు పార్వతీపురం లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఎన్ సి సి అధికారి డి వి వి ఎస్ గుప్త 100 వ సారి రక్తదానం చేసి అభినందనలు అందుకున్నారు తొలిసారిగా 1993లో ఆయన రక్తదానం చేశారు రక్తం కొరత తీర్చేందుకు తనవంతుగా అడుగు వేసిన ఏడాదిలో నాలుగు సార్లు రక్తదానం చేస్తూ సెంచరీ కొట్టారు తన జన్మదినం సందర్భంగా సోమవారం ప్రాంతీయ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం లో 100 వ సారి రక్తదానం చేశారు ఇప్పటివరకు వందకు పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువతలో రక్త దానం పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు 100 వ సారి రక్తదానం చేసిన ఆయన్ని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వాగ్దేవి రక్తనిధి కేంద్రం వైద్యాధికారి శిరీష అభినందించారు
Conclusion:రక్త దానం చేస్తున్న గుప్తా మాస్టారు అభినందిస్తున్న సూపరిండెంట్ వాగ్దేవి మాట్లాడుతున్న వాగ్దేవి మాట్లాడుతున్న గుప్తా రక్తనిధి కేంద్రం