విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మూడో ప్రధాన ఘట్టమైన తెప్పోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. తొలుత వనంగుడిలో అమ్మవారికి స్నానం, పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం గాడిఖానా సమీపంలో ఉన్న పెద్ద చెరువు వద్దకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి హంస వాహనంలో విహరింపజేశారు. మేళతాళాలు, విద్యుద్దీపాలంకరణ మధ్య అత్యంత వేడుకగా జరిగిన తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెప్పోత్సవంలో ఎలాంటి ఘటనలు జరగకుండా మత్స్య, పోలీసుశాఖలు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరున జరిగే చండీహోమంతో ఉత్సవాలు ముగుస్తాయని పైడితల్లి ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇదీ చదవండి :