రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అవినీతి నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అని తెదేపా సభ్యుల సవాల్‌కు తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. అమరావతి నిర్మాణంలో టెండర్ల ప్రక్రియలోనూ... అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. అక్రమాలపై విచారణకు నిపుణుల కమిటీని నియమించామన్న బొత్స... తుది నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధానిలో 25శాతం మించని నిర్మాణ పనులను మాత్రమే నిలిపివేశామని... మిగిలిన పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. శాసనసభ, మండలి భవనాల నిర్మాణంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.
ఇదీ చదవండీ...