విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరిట ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకూ విడుదల చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 57 వేల మందికి గానూ 19 వేల మందికి ఉపకార వేతనాలు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల బకాయిలు ఉన్నాయని.. విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: