ETV Bharat / state

ఘనంగా ముగిసిన విజయ'నగర' ఉత్సవం - vijayanagara utsavalu celebrations

విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో విజయనగరం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు. విజయనగర సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరపాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

విజయనగర ఉత్సవం
author img

By

Published : Oct 15, 2019, 3:05 AM IST

విజయనగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆనందగజపతి కళాక్షేత్రంలో జరిగిన ముగింపు సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలువురు కళాకారులు విజయనగరం చారిత్రక ప్రాశస్త్యం, సంస్కృతి, సంప్రదాయాలని ఉత్సవాల్లో ఘనంగా కీర్తించారు. ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని అమాత్యులు అభిప్రాయపడ్డారు.

ఘనంగా ముగిసిన విజయ'నగర' ఉత్సవం

ఆకట్టుకున్న నృత్యాలు

ముగింపు ఉత్సవాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. నగరానికి చెందిన పలు నృత్య అకాడమీలకు చెందిన బాలికలు ప్రదర్శించిన అమ్మవారి వైభవ నృత్యరూపకం వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. వీటితో పాటు కోట ఆవరణలో విజయనగరం కళలకు ప్రతీకగా నిలిచే పులివేషాలు అందరినీ ఎంతో అలరించాయి.

సంస్కృతి, సంప్రదాయాల నిలయం

విజయనగరం.. సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగర ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన మహనీయుల త్యాగాలను ఈ ఉత్సవాల ద్వారా స్మరించుకోగలమని పేర్కొన్నారు. భావితరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను అందజేసేందుకు ఈ ఉత్సవాలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రులు అన్నారు.

పైడితల్లి అమ్మవారికి పూసపాటి వంశీయుల సారే

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.