రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు... విజయనగరంలో తమ నివాస స్థలాలను అక్రమించారంటూ బాధితులు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు. బొత్స ఆదిబాబు నివసిస్తున్న ప్రదీప్ నగర్‌లోని సత్యసాయి నగర్ లేఔట్లో సుమారు 40 కుటుంబాలకు చెందిన ఇంటి స్థలాలను ఆక్రమించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు అన్ని పత్రాలు, అనుమతులు ఉన్నా అక్రమంగా తమ స్థలాల చుట్టూ ఆయన ప్రహరీ నిర్మించారంటూ బాధితులు అధికారుల ముందు వాపోయారు. సత్య సాయినగర్‌లోని సర్వే నెంబర్ 53/4, 53/5 లేఅవుట్లో పంచాయతీ అనుమతులు, రెవెన్యూ అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ ఆదిబాబు తమవంటూ ఆక్రమించారని... 40కుటుంబాలు విచారం వ్యక్తం చేశాయి. అధికారులు విచారణ చేపట్టి... తమ స్థలాలు తమకు ఇప్పించాలంటూ స్పందనలో సంయుక్త కలెక్టర్ వెంకట రమణారెడ్డికి విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి:'కొత్త రాజధాని వద్దు... మమ్మల్ని కర్ణాటకలో కలపండి'