ETV Bharat / state

కన్నకొడుకు తప్పును పంచుకున్న తల్లిదండ్రులు - విశాఖలో లైంగిక వేధింపులు తాజా వార్తలు

మహిళకు మత్తుమందిచ్చి అసభ్య చిత్రాలు తీశాడు. ఆ చిత్రాలను చూపించి రూ.50 లక్షలు వసూలు చేశాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కుమారుడిదే తప్పని తెలిసినా..ఆ కీచకుడి తల్లిదండ్రులు అతనికే వంతపాడారు. కొడుకును మరింత ప్రోత్సహించారు. వసూలు చేసిన డబ్బులను కలిసి పంచుకున్నారు.

women-harassment-issue-in-visakha
author img

By

Published : Nov 23, 2019, 8:41 AM IST

విశాఖలో మరో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెకు మత్తుమందిచ్చి, స్పృహలో లేని సమయంలో ఆమె అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని అంతర్జాలంలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అందినచోటల్లా అప్పులు చేసి ఆమె ఆ మృగాడికి రూ.50 లక్షలకు పైగా ఇచ్చింది. ఇవ్వడానికి ఇక తన దగ్గర డబ్బులు కూడా లేవని, అప్పుల్లో కూరుకుపోతున్నానని.. వదిలిపెట్టమని చెప్పండని అతని తల్లిదండ్రుల కాళ్లావేళ్లా పడింది. వాళ్లిద్దరూ కొడుకు అకృత్యాలకు అడ్డుచెప్పకపోగా .. అతణ్ని మరింత ప్రోత్సహించారు. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు తెచ్చినప్పుడల్లా అతని అమ్మానాన్నలు కూడా ఆ మొత్తాన్ని పంచుకునేవారని తెలిసి పోలీసులే విస్తుపోతున్నారు.

అంతేకాక నిందితుడు ఆమె అభ్యంతరకర ఫొటోలను ఓ మిత్రుడికిచ్చి అతనితో కూడా ఒకసారి డబ్బులు వసూలు చేయించాడని తేలింది. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నా అతను కన్నుగప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. అనుమానం వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులపై నిఘా పెట్టారు. ఎస్సై స్థాయి అధికారి ఆ వ్యక్తికి కొమ్ముకాస్తున్నట్లు తేలడంతో నివ్వెరపోయారు. నిందితుడి తండ్రిని, స్నేహితుణ్ని ఇప్పటికే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

ఇవి కూడా చదవండి:

సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.