దొంగతనాల కేసుల్లో నిందితుల అరెస్టు - police Arrest of accused in theft cases latest news
విశాఖ నగరంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు కేసుల్లో నిందితుల నుంచి అరకిలో బంగారం, లక్ష రూపాయల నగదు, మూడు టాటా సుమో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చొరీకి గురైన 38 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. మూడు వేర్వేరు కేసులకు సంబంధించి 10 మందిని ఆరెస్టు చేసినట్టు తెలిపారు.