విశాఖలో పారిశుద్ధ్య నిర్వహణలో జీవీఎంసీ పూర్తిగా విఫలమైందని... తెదేపా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి వినయ్‌చంద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డెంగీ, మలేరియా విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నగరంలో ఇప్పటికే పలువురు డెంగీ కారణంగా మృతి చెందారని వివరించారు. కేజీహెచ్‌లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయాలని... డెంగీ మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: డెంగీ జ్వరంతో యువకుడు మృతి