ETV Bharat / state

సీలేరు కాంప్లెక్స్​లో విజిలెన్స్ అధికారిణి పర్యటన

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్​లో ఏపీ జెన్​కో ముఖ్య విజిలెన్స్ అధికారిణి ఎస్.ఎం.రత్నం పర్యటించారు. జలవిద్యుత్ కేంద్రాల భద్రతకు సంబంధించిన నివేదికను తయారు చేయటంలో భాగంగా... అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

vigilence sp visit sileru Hydroelectric power satation complex at visakhapatnam
జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా చర్యలు గురించి అడిగి తెలుసుకుంటున్న విజిలెన్స్ అధికారిణి ఎస్ఎం రత్నం
author img

By

Published : Nov 29, 2019, 8:58 PM IST

సీలేరు కాంప్లెక్స్​లో విజిలెన్స్ అధికారిణి పర్యటన

రాష్ట్రంలో జలవిద్యుత్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని... ఏపీ జెన్‌కో ముఖ్య విజిలెన్స్‌ అధికారిణి ఎస్‌.ఎం.రత్నం తెలిపారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఆమె 3 రోజులు పాటు పర్యటించారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్​ కేంద్రాల పరిధిలో... భద్రతా చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా, కోరాపుట్‌ జిల్లా ఎస్పీలతో జలవిద్యుత్​ కేంద్రాలు, భద్రత గురించి చర్చించారు.

ఇదీ చదవండీ:

ఆశ్చర్యపరిచేలా.. అద్భుతం అనిపించేలా..!

Intro:AP_VSP_57_28_VIGILENCE SP VISIT IN SILERU_AV_AP10153Body:రాష్ట్రంలో జలవిద్యుత్తు కేంద్రాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో ముఖ్య విజిలెన్స్‌ అధికారిణి ఎస్‌ఎం రత్నం అన్నారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఆమె మూడు రోజులు పాటు సుడిగాలి పర్యటన చేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రాలు పరిధిలో తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో బాటు కోరాపుట్‌ జిల్లా ఎస్పీలతో జలవిద్యుత్కేంద్రాలు భద్రత గురించి చర్చించారు. ఇటీవల మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రం పరిధిలో వైద్యసేవలు నిమిత్తం విద్యుదుత్పత్తి నిలిపివేసి ఆందోళన చేసిన విషయంపై ఏపీ జెన్‌కో యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను అధ్యయనం చేయమని ఏపీ జెన్‌కో సీవీఎస్‌వోను జెన్‌కో ఎండీ ఆదేశించడంతో ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్లు ఆమె తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న విద్యుత్కేంద్రాలు భద్రతపై దృష్టిసారించామని, ఇందులో అవసరమైన రక్షణ చర్యలు గురించి ఒక నివేదికను తయారుచేసి ఎండీకి నివేదిస్తామని ఆమె తెలిపారు. జెన్‌కో పరిధిలో వైద్యసంస్థలన్నీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని, అన్ని ఆసుపత్రులు ద్వారా గిరిజనులకు ఉచితంగా సేవలు అందించమని ఆయా అధికారులకు ఆదేశించామని సీవీఎస్‌వో తెలిపారు. మాచ్‌ఖండ్‌లో గతంలో కూలిపోయిన వంతెనను నిర్మించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అత్యవసరంగా వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారని, ఈ విషయాన్ని ఎండీకి దృష్టికి తీసుకువెళ్లనున్నామని సీవీఎస్‌వో తెలిపారు.Conclusion:M Ramanarao,9440715741
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.