ETV Bharat / state

పదో తరగతి విద్యార్థి ప్రతిభ... ప్రపంచ రికార్డు దాసోహం

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు విరామం లేకుండా బోధించాడు. అతని ప్రతిభకు ప్రపంచ రికార్డు దాసోహమంది.

The tenth grade student holds the world record
The tenth grade student holds the world record
author img

By

Published : Jan 3, 2020, 11:48 PM IST

పదో తరగతి విద్యార్థి ప్రతిభకు... ప్రపంచ రికార్డు దాసోహం

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సాధించాడు. 12 గంటల పాటు నిర్విరామంగా పాఠాలు బోధించి ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభతో వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సాధించాడు. విశాఖ జిల్లాలోని తురువోలు గ్రామానికి చెందిన చొక్కాకుల రామ్ కిరణ్..... చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏకధాటిగా పదో తరగతి గణితాన్ని విద్యార్థులకు బోధించాడు. ఆ కార్యక్రమాన్ని వండర్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఆద్యంతం పర్యవేక్షించారు. అనంతరం రామ్​ కిరణ్​ పేరును వండర్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో లిఖించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికేట్​ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.... ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిని అభినందించారు. తన విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉందని రామ్​ కిరణ్​ చెప్పాడు.

ఇదీ చదవండి:అధికారులపై విరుచుకుపడ్డ సభాపతి తమ్మినేని సీతారాం

Intro:Ap_Vsp_36_02_Record_Av_Ap10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ‌రుగంటి రాంబాబు
స్లగ్: గ్రామీణ విద్యార్ధి..బోధనలో రికార్డు
యాంకర్: ఆ పిల్లోడు పదో తరగతి చదువుతున్నాడు. పేరు చొక్కాకుల రామ్ కిరణ్. విశాఖ జిల్లాలో ని మారుమూల మండలమైన చీడికాడ లోని తురువోలు గ్రామం. తండ్రి పేరు విస్సు, తల్లి భారతి. వీరి కుటంబ నేఫధ్యం వ్యవసాయం.
ఇంతకీ కధమేమిటంటే రామ్ కిరణ్ పదవ తరగతి గణితం సబ్జెక్టును 12 గంటల పాటు ఏకధాటిగా పదవ తరగతి విద్యార్థులకు బోధించాడు. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిర్విరామంగా గణితం బోధించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించాడు. ఈ కార్యక్రమంను ఆద్యంతం పర్యవేక్షించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కోరుకొండ రంగారావు గణితం బోధించిన రామ్ కిరణ్ పేరు బుక్ లో లిఖించనున్నట్లు ప్రకటించారు. ముగింపునకు హాజరైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రపంచ రికార్డు సాధించిన రామ్ కిరణ్ ను అభినందించారు. రామ్ కిరణ్ చోడవరంలో ని ఏడమ్స్ స్కూల్ లో పదవతరగతి చదువుతున్నాడు. తాను ఐఎఎస్ కావాలని కోరుకంటంన్నట్లు రామ్ కిరణ్ తెలిపారు.

గమనిక: ముగింపు విజువల్స్ ఈటీవీ వాట్సాప్ నెంబర్ ద్వారా పంపా పరిశీలించగలరు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.