విశాఖ మన్యం పెదబయలు మండలం అర్లాబులో ఓ వ్యక్తి... భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుట్టన్న అనే వ్యక్తి మద్యానికి భార్యను డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పి పొలం పనికి వెళ్ళిపోయింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి తండ్రి పడిపోయి ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అతని తల్లికి తెలియజేశాడు. పెదబయలు నుంచి పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
ఇవీ చదవండి