ETV Bharat / state

విశాఖలో 6 వేలకు పైగా ఎకరాల భూ సమీకరణ - Over 6,000 acres of land in Visakha

నవరత్నాల అమల్లో భాగంగా పేదల ఇళ్ల స్థలాల కోసం భూ సమీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం...ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విశాఖ నగరంలో ల్యాండ్ పూలింగ్ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. విశాఖలో మొత్తం 6 వేల పైచిలుకు ఎకరాలను భూ సమీకరణ విధానం ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

The government has decided to acquire land through land mobilization to provide land for the poor in Visakha
విశాఖలో పేదలకు ఇళ్లస్థలాలు
author img

By

Published : Jan 26, 2020, 6:51 AM IST

విశాఖలో 6 వేలకు పైగా ఎకరాల భూ సమీకరణ
విశాఖలో పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చేందుకు భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 10 మండలాల్లో లాండ్ పూలింగ్ ద్వారా 6,116.50 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం భూ సమీకరణ ప్రక్రియ అంతా విశాఖ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని నిర్దేశించింది. వీఎంఆర్​డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ భూమిని అభివృద్ది చేసి తిరిగి కలెక్టర్​కి అప్పగిస్తే, ఆ భూమిని పేదల ఇళ్లపట్టాల కోసం వినియోగిస్తారని ఉత్తర్వుల్లో వివరించారు. వారం రోజుల్లోగా ల్యాండ్ పూలింగ్​కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని ..ఐదునెలల్లోగా అభివృద్ధి చేసిన భూమిని పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం తెలిపింది.

అత్యధికంగా అనకాపల్లిలో

ఒక్క విశాఖ జిల్లాలోనే లక్షా 50 వేల 584 మంది లబ్ధిదారులు ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 1452.87ఎకరాలను సమీకరించనున్నారు. భీమునిపట్నంలో 486 ఎకరాలు, పద్మనాభం మండలంలో 515 ఎకరాలు, సబ్బవరం మండలంలో 1373.87 ఎకరాలు, ఆనందపురం మండలంలో 114.40 ఎకరాలు సమీకరించనున్నారు. పరవాడలో 343 ఎకరాలు, గాజువాకలో 88 ఎకరాలు, పెదగంట్యాడలో 159 ఎకరాలు తీసుకోనున్నారు. విశాఖ గ్రామీణంలో అతి తక్కువగా కేవలం 96.40 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. మొత్తం సేకరించాల్సిన భూమిలో 2552.33 ఎకరాలు అసైన్డ్ భూమికాగా, పీవోటీ భూమి 464.60 ఎకరాలు, ఆక్రమణలలో ఉన్న భూమి 2,343.98 ఎకరాలు, ఖాళీ భూమి 755.59 ఎకరాలు సమీకరించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. మొత్తంగా విశాఖ జిల్లాలో 6,116 ఎకరాలను సమీకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

భూసమీకరణ కింద తీసుకునే వాటిలో గరిష్ఠంగా డీపట్టా భూములే ఉన్నందున... వారికి ఆమోదయోగ్యమైన ప్యాకేజీని సిద్ధం చేశారు. అసైన్డ్ భూములకు ఎకరాకు 900 గజాలు, పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు... ఐదు నుంచి పదేళ్ల లోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు చొప్పున తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం విధివిధానాల్లో పేర్కొంది. అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్​డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదీచూడండి.విశాఖలో మరో కీలక అడుగు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.