ETV Bharat / state

ఆన్​లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - ఏపీలో ఆన్ లైన్ మోసాలు

విశాఖ సైబర్ క్రైం పోలీసులు భారీ సైబర్ మోసం కేసును ఛేదించారు. ఫేస్ బుక్ పరిచయం ద్వారా ఓ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి 34 లక్షల రూపాయల నగదును కొల్లగొట్టిన ఓ నైజీరియన్ సహా హర్యానాకు చెందిన వ్యక్తిని దిల్లీలో అరెస్టు చేశారు.

ఆన్​లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
author img

By

Published : Nov 20, 2019, 3:31 PM IST

ఆన్​లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

అమ్మాయి పేరుతో ఫేస్​బుక్​లో పరిచయమై.. ఆన్​లైన్​ మోసాలకు పాల్పడిన నైజీరియా వ్యక్తితో అతనికి సహకరించిన మరో వ్యక్తిని విశాఖ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. కేసు వివరాలను విశాఖ కమిషనర్ ఆర్.కె.మీనా వెల్లడించారు. బర్మింగ్​హమ్​కు చెందిన అన్నారోస్​గా నిందితులు నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి పరిచయం అయ్యారు. ఫేస్​బుక్ సంభాషణ తరువాత విలువైన బహుమతులు పంపిస్తున్నట్లు బాధితుడిని నమ్మించారు. బహుమతుల్లో భారీగా విదేశీ నగదు ఉందని కస్టమ్స్ అధికారులుగా నిందితులు బాధితుడుని ఫోన్​లో సంప్రదించారు.

నగదును అప్పగించే నిమిత్తం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ... బాధితుడి నుంచి వివిధ అకౌంట్లకు 34 లక్షల19 వేల రూపాయల నగదును జమ చేయించుకున్నారు. అయినా నగదు, బహుమతులు రాకపోవంటతో మోసపోయామని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇజుమెజు లక్కీ ఓఝూతోపాటు హర్యానాకు చెందిన దీపక్​లను దిల్లీలో అరెస్టు చేశారు. వారి నుంచి 2 లక్షల నగదు, 95 సిమ్ కార్డులు, 5 ఏటీఎం కార్డులు, ల్యాప్​టాప్, 7 సెల్​ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.

ఇదీచదవండి

పెళ్లివేడుక నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.