విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో పుస్తకాల నిల్వగదిలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బకెట్లతో నీరు తెచ్చి... మంటలు అదుపులోకి తెచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. విద్యార్థులు బృందాలుగా సామగ్రిని వేరు చేసి... మంటలు అదుపు కాకుండా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదంలో విలువైన పుస్తకాలు, ఇన్వెర్టర్, విద్యుత్ సామగ్రి కాలిపోయాయి, కొంత సామాగ్రిని మంటలు అంటుకున్నా విద్యార్థులు బయటకు తరలించారు. మధ్యాహ్నం ఈ ప్రమాదం జరగడంతో మంటలను అదుపు చేయగలిగామని.. ఇదే అర్ధరాత్రి జరిగి ఉంటే పాఠశాల కళాశాల గదులు పూర్తిగా దగ్ధమయ్యేవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల సాహసాన్ని అధ్యాపకులు కొనియాడారు.
విద్యుదాఘాతంతో పాఠశాలలో మంటలు...అదుపు చేసిన విద్యార్థులు - విశాఖ పాడేరు ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం వార్తలు
ఏజెన్సీప్రాంతమైన పాడేరు ప్రభుత్వ పాఠశాలలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. పుస్తకాల నిల్వగదిలో చెలరేగిన మంటలను విద్యార్థులు అదుపులోకి తెచ్చారు.