విశాఖ జిల్లా చీడికాడలో కొంతకాలంగా కోళ్లను స్వాహా చేస్తోన్న కొండ చిలువని స్థానికులు పట్టుకున్నారు. అప్పల నాయుడు అనే రైతు నాటుకోళ్లను పెంచుతున్నాడు. కోళ్ల గూటిలో చేరిన కొండచిలువ రోజూ వాటిని స్వాహా చేసేది. రోజు రోజుకూ కోళ్లు తగ్గిపోవటంతో రైతుకు అనుమానం వచ్చి గూటిపైన చూశాడు. కొండచిలువని గుర్తించి పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతను కొండచిలువను పట్టుకుని.. సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలి పెట్టారు.
ఇదీ చూడండి: