విశాఖ జిల్లాలోని భీమిలి-నర్సీపట్నం రహదారి గోతులుపడి అధ్వానంగా మారింది. మరమ్మతులకు నోచుకోక పదడుగులకు ఒక గోతితో దారుణంగా తయారైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ రోడ్డుపై ప్రయాణం చేయాల్సి వస్తోందంటూ ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికే ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు.
ఈ రహదారి చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల మీదుగా వెళుతుంది. గోతులతో దాదాపుగా రోడ్డు మొత్తం ఛిద్రంగా మారింది. గ్రామస్థులే వాహనచోదకులను హెచ్చరికగా ఆ గోతులపై ఎర్ర చీరలు కట్టారు. వర్షాలు కురిస్తే నీరు నిలిచి గోతులు కనిపించక ప్రమాదాలు ఎక్కువయ్యావని.. ఇప్పటికైనా ఈ రోడ్డును బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి..