విశాఖ నగర వైకాపా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేశారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వీ.వీ. సత్యనారాయణ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత కూడా తప్పును గుర్తించలేదు. అనంతరం పొరపాటును సరిదిద్దుకుని జాతీయ పతాకాన్ని సరిగ్గా ఎగురవేశారు.
ఇవీ చదవండి: