నిధులు దుర్వినియోగంపై గ్రామస్థులు గత నెల 30న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 'అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం' అనే శీర్షికతో ఈటీవీభారత్లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు. మాజీసర్పంచ్, కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎల్పీఓ కొండలరావు తెలిపారు.
ఇదీ చూడండి
బిల్డ్ ఏపీ కాదు సేల్ ఏపీ: రామానాయుడు