విశాఖలోనే గణతంత్ర వేడుకలు.. ప్రభుత్వం నిర్ణయం - 2020 Republic Day Celebrations news in Visakha
గణతంత్ర దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలోనే వేడుకలు నిర్వహించాలని అక్కడి అధికారులకు సూచించారు.