ETV Bharat / state

మన్యంలో ఉద్రిక్త వాతావరణం..! - ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సోమవారం నుంచి వారంరోజులుపాటు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

మన్యంలో మరోమారు ఉద్రిక్త వాతవరణం
మన్యంలో మరోమారు ఉద్రిక్త వాతవరణం
author img

By

Published : Dec 1, 2019, 7:54 PM IST

మన్యంలో ఉద్రిక్త వాతావరణం..!

సోమవారం నుంచి మావోయిస్టు పార్టీ ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహించనున్నారు. పీఎల్‌జీఏ స్థాపించి 18 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో... మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏవోబీలో పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మన్యం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు.

కాఫీ తోటలను పంచాలనే నినాదాన్ని గిరిజనుల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న వ్యూహంతో... మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ... పలుచోట్ల కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల కొండజర్త, పేములగొంది అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనకు నిరసనగా... మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేశాయి.

ఇవీ చదవండి

బద్వేలు గ్రామసభలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

Intro:AP_VSP_57_01_RED ALERT IN AOB_AVB_AP10153Body:
మావోయిస్టులు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండడంతో ఆంద్రాఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మావోయిస్టులు ప్రతీ ఏటా డిశెంబ‌రు 2 నుంచి వారం రోజులు పాటు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించ‌డం ప‌రిపాటి. సోమవారం నుంచి ప్రారంభం కానుండంతో ఏవోబీ ప్రాంతంలో యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. 1999 ఆదిలాబాద్‌ జిల్లా కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, మహేష్‌, శ్యాంలు మరణించారు. 2000 డిశెంబరు రెండో తేదిన వీరి జ్ఙాపకార్దం పీఎల్‌జీఏ ను ఏర్పాటుచేఉసి 2001 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి వారం రోజులు పాటు వివిధ కార్యక్రమాలను మావోయిస్ట్‌లు నిర్వహించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. వారోత్సవాలు నేప‌థ్యంలో మ‌న్యంలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులు ఒడిశా నుంచి వ‌చ్చి ఇక్కడ విద్వంసాలు సృష్టించ‌కుండా ఉండేందుకు నాలుగు రోజులు నుంచి ఏవోబీలో గాలింపు ముమ్మరం చేసింది. పీఎల్‌జీఏ వారోత్సవాల నేప‌థ్యంలో స‌రిహ‌ద్దులో్ ఉన్న ముంచంగిపుట్టు, పెదబ‌య‌లు, జిమాడుగుల‌, అన్నవ‌రం, చింత‌ప‌ల్లి, జీకేవీధి, సీలేరు పోలీస్‌స్టేష‌న్లను జిల్లా పోలీసుయంత్రాంగం అప్రమత్తం చేసింది. అనుమానితుల‌ను ప్రశ్నిస్తున్నారు. .సీఆర్‌పీఎఫ్‌, ప్రత్యేక మ‌రియు గ్రేహౌండ్స్‌ పోలీసుబ‌ల‌గాలు మోహ‌రించి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ గ‌స్తీ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి గ్రామాల్లో పోలీసు బ‌ల‌గాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయి. వారోత్సవాల నేప‌థ్యంలో ప్రజాప్రతినిధులను అధికారులు, గుత్తేదార్లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిపోవాల‌ని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. ర‌హ‌దారి ప‌నులు చేస్తున్న వాహ‌నాల‌ను పోలీసులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. రామ్‌గుడా ఎన్‌కౌంట‌ర్‌తో భారీ న‌ష్టాన్ని చ‌విచూసిన మావోయిస్టులు డుంబ్రిగుడ మండ‌లం లివిటుపుట్టు ఘ‌ట‌న‌తో దూకుడు పెంచారు. . వారోత్సవాల‌కు పోలీసులు గాలింపులు జ‌ర‌గుతున్న నేప‌థ్యంలో ఏవోబీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా పీఎల్‌జీఏ వారోత్సవాలు విజ‌య‌వంతం చేయాల‌ని ఏజెన్సీలో ప‌లుప్రాంతాల్లో మావోయిస్టులు క‌ర‌,గోడ ప‌త్రాల‌తో బాటుగా, బ్యాన‌ర్లు కూడా వేలాడ‌దీసారు. పీఎల్‌జీఏ వారోత్సవాలు నేప‌థ్యంలో మారుమూల ప్రాంతాల‌కు వెళ్లే ఆర్టీసీ స‌ర్వీసుల‌ను నిలిపివేశారు.
బైట్‌
కె.సతీష్‌కుమార్‌, ఎఎస్‌పీ, చింతపల్లి
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.