విశాఖలో మత్తుపదార్ధాలకు సంబంధించిన కేసులో నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాబాగార్డెన్స్ లలితానగర్‌లో డ్రగ్స్ కలిగి ఉన్న నరేంద్రబాబు అతని స్నేహితురాలిని అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన నరేంద్రబాబు గోవా, బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలు తీసుకొచ్చి విశాఖ, హైదరాబాద్‌లో అమ్ముతుంటాడని తెలుసుకొని నిఘాపెట్టి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత మత్తు పదార్థాలతోపాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారికి సహకరిస్తున్న వెంకటరమణ, అప్పలరాజునూ అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:పాడేరులో వేయి కిలోల గంజాయి పట్టివేత