అమరావతి, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనే తాము చెబుతున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అవినీతిని పవన్ కల్యాణ్ సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు. నవరత్నాలకు అనుకూలమో, వ్యతిరేకమో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో పవన్‌కు తెలియదా..? అని ప్రశ్నించారు.
ఇసుక విధానం సరిదిద్దే ప్రయత్నంలో కాస్త ఆలస్యమవుతోందన్న మంత్రి... తెలుగుదేశం ఉచ్చులో పడొద్దని పవన్‌కు విజ్ఞప్తి చేశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలను పవన్ ఒక్కసారైనా కలిశారా..? అంటూ నిలదీశారు. కాపులకు బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు పెట్టామన్న మంత్రి... చిరంజీవిలా కష్టపడి స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి బొత్స అని వివరించారు. రాజధాని విషయంలో పవన్ యూటర్న్ తీసుకుని మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండీ... 'ధరల స్థిరీకరణ నిధి సద్వినియోగం అయ్యేలా చూడాలి'