విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ పాడేరులో డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికపై పౌరసత్వం ఇవ్వాలని... పార్లమెంట్లో పెట్టిన సవరణ బిల్లును రద్దు చేయాల్సిందే అన్నారు.
ఇదీ చదవండి: