డుడుమ జలపాతంలో గల్లంతైన యువకుడి ఆచూకీ లభించింది. ఒడిశాలోని జయపురానికి చెందిన పొట్నూరు కిరణ్ కుమార్ నవంబరు 26న ప్రమాదవశాత్తు ఆంద్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న డుడుమ జలపాతంలో పడిపోయాడు. గత ఆరు రోజులుగా బలగాలు గాలించినప్పటకి ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు నిన్న కిరణ్ మృతదేహాన్ని కనుగొన్నారు. సహాయక బలగాలు సాయంత్రానికల్లా కిరణ్ మృతదేహాన్ని మెట్ల మార్గంలో మోసుకుని తీసుకువచ్చారు. మృతదేహానికి శవ పరీక్షలు చేసి కుటుంబానికి అప్పగించారు.
ఇదీ చదవండీ: