విశాఖ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు ఉప మార్కెట్ యార్డులుగా కొనసాగుతున్న పాయకరావుపేట, అరకు లోయ, పెందుర్తి, మాడుగుల యార్డులను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా.. కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ మార్కెట్ సముదాయాలు రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. పాయకరావుపేట యార్డును కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. లక్షల రూపాయలు పెట్టి పండ్లు మగ్గపెట్టే కేంద్రం ఏర్పాటుచేశారు. అది నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పడీ యార్డులు అభివృద్ధి అవుతాయని.. తమకు ఉపయోగంగా ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..