విశాఖలోని పద్మనాభం స్వామి ఆలయంలో... కోటి దీపోత్సవం జరిగింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య సూర్యాస్తమయం తర్వాత... అనంతుని 1285 కొండ మెట్లకు దీపాలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. 36 ఏళ్ల నుంచి నేటివరకు కోటి దీపోత్సవం సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు రాయగడ, విజయవాడ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్తీకమాసంలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఇదీ చదవండి: వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం