ETV Bharat / state

మహిళపై వేధింపులు... సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు - సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు

ఓ మహిళా టీచర్​ని ప్రేమిస్తున్నాను..పెళ్లి చేసుకుంటానని ఓ ప్రబుద్ధుడు అని నమ్మించాడు. ఆమెకి సంబంధించిన అసభ్యకర చిత్రాలను ఓ సామాజిక గ్రూపులో పంపించాడు. విషయం తెలుసుకున్న టీచర్ ఆత్మహత్యకు ప్రయత్నించగా... తోటి ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.

Harassment on a woman with obscene posts on social media at visakha
మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు
author img

By

Published : Dec 7, 2019, 4:56 PM IST

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో ..మహిళపై వేధింపులు

విశాఖలోని ఓ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. 15 నెలల కిందట ఆమె భర్త మృతి చెందాడు. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా దివిలికి చెందిన ఆకుల అచ్యుత్​కుమార్ అనే మేస్త్రీ ఆమెను ప్రేమిస్తున్నాను..పెళ్లిచేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు చిత్రీకరించి.. 250 మంది ఉపాధ్యాయులు ఉండే వాట్సప్, ఫేస్​బుక్​ సామాజిక గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉపాధ్యాయురాలు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులూ మానసికంగా వేధించడంతో చివరకు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ ఉద్యోగుల సంఘం పోలీసులకు సాక్ష్యాలను చూపించారు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి ఏదో ఆసరా కోసం పెళ్లి చేసుకుందామనుకుంటే... ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు అన్నారు. ఇప్పటికైనా బాధితురాలికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీచూడండి.దిశ ఎన్ కౌంటర్.. ఊరట మత్రమే!

సెంటర్: పాడేరు. శివ ఫైల్: 1) ap_vsp_77_07_asabhya_chitralu_teacher_harass_paderu_avb_ap10082 2) ap_vsp_77_07_asabhya_chitralu_teacher_harass_paderu_av_ap10082 3) ap_vsp_77_07_asabhya_chitralu_teacher_harass_paderu_ab_ap10082 యాంకర్: ఓ మహిళా టీచర్ అని చూడకుండా ఓ ప్రబుద్ధుడు ఆమెతో ప్రేమ పెళ్లి నటించి కలిసి ఉన్న ఫోటోలను రహస్యంగా చిత్రీకరించి ఏజెన్సీ మహిళా టీచర్లు ఉన్న సామాజిక గ్రూపుల్లో పంపించాడు విషయం తెలుసుకున్న టీచర్ ఆత్మహత్య ప్రయత్నించగా తోటి గిరిజన ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటన విశాఖ కేంద్రం పాడేరు పరిధిలో చోటు చేసుకుంది..... వాయిస్1) విశాఖ మన్య కేంద్రం పాడేరు మండలం లో ఓ పాఠశాలలో మహిళా టీచర్ పని చేస్తున్నారు. 15 నెలల కిందట ఆమె భర్త మృతి చెందాడు. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా దివిలి కి చెందిన ఆకుల అచ్యుత్ కుమార్ అని మేస్త్రి ఉపాధ్యాయురాలు ఇంటికి పని వచ్చాడు తాను బీటెక్ చదివానని నమ్మబలికి ప్రేమ పెళ్ళి తో వశపర్చుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ రోజులు గడుపుతున్నాడు. పెద్దల మధ్య పెట్టగా అచ్యుత్ కుమార్ పెద్దలను తీసుకుని రమ్మని చెప్పారు దీనిని పెడచెవిన పెట్టి గత ఆరు నెలలుగా వేధిస్తున్నాడు. బైట్: బాధిత ఉపాధ్యాయురాలు, పాడేరు.. వాయిస్2) అక్టోబర్లో ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు లేవు గత మూడు రోజుల నుంచి 250 మంది ఉపాధ్యాయులు ఉండే వాట్సప్ ఫేస్బుక్ సామాజిక గ్రూపుల్లో గతంలో టీచర్ తో ఉన్న అసభ్యకర రహస్యమైన నాలుగు గోడల మధ్య ఉండే రాసక్రీడలు అన్ని గ్రూపులకు షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం ప్రూఫ్ ఏముంది, ఏ వీడియోలు, ఏ ఫోటోలు ఏ గ్రూపులు, అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చిత్ర హింసలకు గురైన ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించింది ఈ విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన మహిళ ఉద్యోగుల సంఘం అందరికీ తెలియజేసింది వారంతా పోలీస్స్టేషన్కు వెళ్లి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ లో అసభ్యకర ఫోటోలు వీడియోలు చూపించారు. గిరిజనేతర కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని కోరుతున్నారు. బైట్: ఉపాధ్యాయురాలి ,తల్లి, పాడేరు, వాయిస్3) భర్త పోయి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి ఏదో ఆసరా కోసం పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు ఆమె తల్లి జీర్ణించుకోలేకపోతున్నారు ఒకానొక సమయంలో ఆత్మహత్య ప్రయత్నించగా ఆదివాసి గిరిజన మహిళ ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. తాము అండగా ఉన్నామంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు. బైట్: గిడ్డి వరలక్ష్మి ఆదివాసి గిరిజన ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి పాడేరు.. వాయిస్4) మణికుమారి సైతం పోలీస్స్టేషన్కు వెళ్లి నిందితుడిని పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులు చెప్పారు. రంగంలో దిగి నెట్వర్క్ ఆధారంగా నిందితుడు ఆకుల అచ్యుత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతని వెనకాల పాడేరు సంబంధించినటువంటి కొంతమంది ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది భర్త పోయిన ఈమెను బయట వెళ్లగొట్టి ఆస్తిని కాజేయాలని దురుద్దేశంతో ఉన్నట్లుగా కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు. బైట్4) మణికుమారి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఎండ్ వాయిస్) పోలీసులు సకాలంలో స్పందించి పోవడం వల్లే ఇలాంటి దౌర్జన్యాలు మహిళ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సకాలంలో స్పందించి న్యాయం చేయాలంటూ మహిళా సంఘ ఉద్యోగులు కోరుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఏ ఒక్కరికి పునరావృతం కాకూడదంటే ఆమెకు ఇంత పరువు నష్టం జరిగినప్పటికీ కూడా భయపడకుండా కెమెరా ముందు తన బాధను వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యక్తి తో ఉండేది లేదంటూ బాధపడుతుంది. శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.