ETV Bharat / state

వింతైన ఎలుకలు... చూసేందుకు పర్యటకుల ఉరకలు - funny rats at visakha manyam

ఇంట్లో ఒక్క ఎలుక ఉందంటే చాలు దాన్ని ఎలా తరిమికొడదాం.. లేక ఏ మందో పెట్టి చంపుతామని చూస్తుంటాం. ఎందుకంటే ఇంట్లో ఫర్నీచర్ దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ నాశనం చేస్తాయి కాబట్టి. కానీ వాళ్లు మాత్రం పెంపుడు జంతువుల్లా రెండు చిట్టెలుకలను పెంచుకుంటున్నారు. అవి చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి చిట్టి చిట్టి ఎలుకలవైపు!

funny rats at visakha manyam
వింతైన ఎలుకలు
author img

By

Published : Dec 7, 2019, 4:40 PM IST

విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం తాజంగిలో ఓ గిరిజన కుటుంబం ఎంతో ప్రేమగా ఎలుకలను పెంచుకుంటోంది. కొన్నాళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలు తాజంగిలో నివాసముంటున్నాయి. తాజంగి గ్రామంలో టిక్కితపాడు వీధిలో నివాసముంటున్న కొర్రా మల్లమ్మ సూరిబాబు దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీనుబాబు ఇటీవల ఒడిశాలోని జయపురం వెళ్లారు. అక్కడ నుంచి రెండు పెంపుడు ఎలుకలను తీసుకువచ్చాడు.

వింతైన ఎలుకలను పెంచుతున్న గిరిజన కుటుంబం

ఆడ, మగ ఎలుకలు తెలుపు, నలుపు ఊదారంగుల కలయికతో ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. కుందేళ్ల మాదిరిగానే ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తున్నాయి. మనుషులతోనూ మచ్చికగా మసులుతున్నాయి. వీటికి ఆహారంగా అన్నం, పాలు, పచ్చిగడ్డి పెడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇవి ఇంట్లో ఉంటే పాములు, సాధారణ ఎలుకలు బెడద ఉండదని వీరు చెబుతున్నారు. తాజంగికి వచ్చే పర్యటకులు గిరిజన కుటుంబం పెంచుతున్న రంగుల ఎలుకలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చూడండి
ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం

Intro:
విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం తాజంగిలో ఓ గిరిజన కుటుంబం ఎంతో ప్రేమగా ఎలుకలను పెంచుకుంటోంది. ఎలుకలా? అని అశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే.... అదేంటి ఎవరైనా పెంపుడు జంతువులంటే ప్రేమగా కుక్కలను పెంచుకుంటారు. లేదా పిల్లులను పెంచుకుంటారు...ఇలా ఎలుకలను పెంచుకోవడమేమిటి అని సందేహం వస్తుంది కదూ ఆ వివరాలేమిటో తెలుసుకుందాం పదండి.....
చాన్నాళ్లు కిందటి ఒడిశా నుంచి వలస వచ్చిన గిరిజనకుటుంబాలు తాజంగిలో నివాసముంటున్నారు. తాజంగి గ్రామంలో టిక్కితపాడు వీధిలో నివాసముంటున్న కొర్రా మల్లమ్మ సురిబాబు దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీనుబాబు ఇటీవల ఒడిశాలోని జయపురం వెళ్లారు. అక్కడ నుంచి రెండు పెంపుడు ఎలుకలను తీసుకువచ్చాడు. ఆడ, మగ ఎలుకలు తెలుపు, నలుపు ఉదారంగుల కలయికతో ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. కుందేళ్ల మాదిరిగానే ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తున్నాయి. మనుష్యులతోనూ మచ్చికగా మసులుతున్నాయి. ఆడ ఎలుకలు నెలలోనే గర్భం రెండు పిల్లలను పెడుతుందని వీటిని పెంచుతున్న మల్లమ్మ తెలిపారు. వీటికి ఆహారంగా అన్నం, పాలు, పచ్చిగడ్డి తింటున్నాయి. ఇవి ఇంట్లో ఉంటే పాములు, సాధారణ ఎలుకలు బెడద ఉండదని వీరు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇవి చేసే వింతైన శబ్దాలకు , అరుపులకు పాములు, ఎలుకలు దరి చేరవని వారంటున్నారు. తాజంగి కి వచ్చే పర్యటకులు గిరిజన కుటుంబం పెంచుతున్న రంగుల ఎలుకలను చూసేందుకు ఆసక్తి
చూపుతున్నారు. గిరిజనుల ఇంట పెరుడుతున్న పెంపుడు ఎలుకలపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎలుకల జాతికే చెందిన వీటిని శాస్త్రీయ నామం రాటస్‌ సర్వోజీయస్‌ అని వీటిని అధికంగా వినియోగిస్తారని, మనుష్యులతో మచ్చికగా
ఉండటంతో కొందరు ఆసక్తిగా ఈఎలుకలను ఇళ్లల్లో పెంచుతుంటారని తెలిపారు.
బైట్‌:
మల్లమ్మ, తాజంగి, పెంపకం దారుడు
శ్రీనుబాబు ,తాజంగి, పెంపకందారుడు

Body:AP_VSP_57a_05_VISAKHA MANYAM LO ELUKALA PEMPAKAM_AVB_AP10153Conclusion:M Ramanarao,9440715741
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.