జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు అనుగుణంగా విశాఖ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ పోర్టు స్టేడియంలో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ద్రోణంరాజు విశాఖ నగరానికి క్రీడల్లో ఉన్న ప్రత్యేకతను వివరించారు. అనంతరం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి విజేతలకు బహుమతులు అందించారు
ఇవీ చదవండి