ఇదీ చదవండి:
విశాఖలో ఘనంగా సీఎస్ఐఆర్ ఆవిర్భావ దినోత్సవం - సీఎస్ఐఆర్ జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ ఆవిర్భావ దినోత్సవాలు
సీఎస్ఐఆర్ జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ ఆవిర్భావ దినోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీఈఎస్ఎస్ తిరువనంతపురం డైరెక్టర్ పూర్ణచందర్ పాల్గొన్నారు.
బేస్ ఐసోలేషన్ భేష్
బేస్ ఐసోలేషన్ సాంకేతికతతో నిర్మించిన ఇళ్లు భూకంపాలను తట్టుకుంటాయని ఎన్సీఈఎస్ఎస్ తిరువనంతపురం డైరెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. విశాఖలో జరిగిన సీఎస్ఐఆర్ జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ 54వ ఆవిర్భావ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జపాన్లో భూకంపాలు తట్టుకునే ఇళ్లను నిర్మిస్తున్నారని చెప్పారు. పెద్ద భూకంపాలను ముందుగా అంచనా వేసే సాంకేతికత ఇప్పటివరకూ మనకు అందుబాటులో లేదని అన్నారు. భూకంపాలు, సునామీలు ఏ విధంగా సంభవిస్తాయో విద్యార్థులకు వివరించారు.
ఇదీ చదవండి:
sample description