ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...! - cpm party press meet in visakha

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భూములు ఇచ్చేందుకు పోస్కో కంపెనీతో ఒప్పందం అంశన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను జాయింట్ వెంచర్ పేరుతో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో ఒప్పందం చేసుకోబోతోందని ఆరోపించారు. ప్రభుత్వం పోస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అప్పగించడంపై వైఖరిని వెల్లడించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేస్తే... సీపీఎం పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

cpm party press meet on posco in visakha
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్. నర్సింగరావు
author img

By

Published : Jan 9, 2020, 10:57 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...!

విశాఖ స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...!

ఇదీ చూడండి:

బలిమెల.. నీటిని వాడుకుందామిలా!

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_09_CPM_on_POSCO_in_vizag_steel_ab_AP10148

( ) విశాఖ స్టీల్ ప్లాంట్ లో భూములు ఇచ్చేందుకు పోస్కో కంపెనీతో ఒప్పందం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు విశాఖ సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


Body:విశాఖ స్టీల్ ప్లాంట్ ను కమీషన్ల కోసం చౌకగా అమ్మడం దేశద్రోహం అని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా నిలబడుతుందా లేదా అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సి.హెచ్. నర్సింగరావు ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను జాయింట్ వెంచర్ పేరుతో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో ఒప్పందం చేసుకోబోతోందని దీనికి నిరసనగా జనవరి 8న 100% స్టీల్ కార్మికులు సమ్మె చేశారని గుర్తు చేశారు.


Conclusion:ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అప్పగించడంపై వైఖరిని వెల్లడించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేస్తే సిపిఎం ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.

బైట్:సి.హెచ్.నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, సి.పి.ఎం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.