ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టులపై గ్రామస్థులు ఎదురు తిరగడం.. ఓ మావోయిస్టు మృతి చెందిన ఘటన అనంతరం.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏవోబీలోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో ఉన్న జొడంబో పంచాయతీ జొంతురాయి అటవీప్రాంతంలో... రహదారి పనులను మావోయిస్టులు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే... హెచ్చరించడానికి వచ్చిన మావోయిస్టులపై స్థానికులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే దాడికి దిగారు. ఆడ్మా అనే మావోయిస్టును హతమార్చారు. ఘటనలో.. జిఫ్రోను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొట్టమొదటిసారి ఇంతగా మావోయిస్టులపై గ్రామస్థులు ఎదురు తిరగడమే ఉద్రిక్తతకు కారణమైంది. ప్రతీకార దాడులకు దిగిన మావోయిస్టులు.. జొంతురాయిలోని ఇళ్లు, ద్విచక్రవాహనాలను తగులబెట్టారు.
పోలీసు బందోబస్తు
ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. వివాదానికి కారణమైన రహదారి వద్ద.... గస్తీ ఏర్పాటు చేశారు. ఎప్పడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో జోడంబో, పనసపుట్, అండ్రాపల్లి ప్రజలు కొందరు... ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మల్కన్గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్విహిస్తున్నట్టు ఎస్పీ రిషికేశ్ డీ కీలారి తెలిపారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం...వాళ్లు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆ ప్రాంతంలో క్యాంపు వేశాం...ప్రజల డిమాండ్లు సరైనవే ఐతే..వాటిని తీర్చే బాధ్యత మాపై ఉంది. మావోయిస్టుల స్వార్ధం బయటపడింది. ఆదివాసీల మధ్య ఘర్షణ సృష్టించారు. అది కాస్తా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది.
- రిషికేశ్ డీ కీలారి. ఎస్పీ
ఇదీ చూడండి: