ప్రస్తుతం పాఠశాలల్లో కనీస వసతులు, సదుపాయాలు లేని దుస్థితి ఉందని... 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు. చదువుల దీపం కుటుంబానికి వెలుగు ఇస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నామన్నారు. ఏయూలో పూర్వ విద్యార్థుల సదస్సులో మాట్లాడిన ఆయన.. ఆంగ్లమాధ్యమంతో బోధనా సమస్యలు కచ్చితంగా ఉంటాయని... వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉన్నత విద్యపైనా దృష్టి సారిస్తామన్న సీఎం... బీటెక్ కోర్సును ఐదేళ్లకు పెంచి బీటెక్ ఆనర్స్‌గా ప్రవేశపెడతామన్నారు. చివరి ఏడాదిలో పరిశోధనకు, ఉద్యోగ సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. బోధనా ఫీజుల చెల్లింపులు వందశాతం జరిగేలా కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే విద్యాదీవెన పథకం కింద ఏటా రూ. 20 వేలు విద్యార్థులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏయూ అల్యుమ్ని అసోసియేషన్‌కు రూ. 50 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.
ఇదీ చదవండి: