ETV Bharat / state

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె..? - 108 staff strike

108 సిబ్బంది సమ్మె ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో సకాలంలో చికిత్స అందక 3నెలల చిన్నారి మృతి చెందింది. 108 సిబ్బంది సరిగా స్పందించకపోవడమే.. చిన్నారి మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె
author img

By

Published : Jul 24, 2019, 7:59 PM IST

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది చేస్తున్న సమ్మె ఓ పసిపాప ప్రాణాన్ని బలిగొంది. సకాలంలో వైద్యం అందక 3నెలల చిన్నారి కన్నుమూసింది. విశాఖ జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి సమీపంలోని బూరుగుచెట్టు గ్రామానికి చెందిన 3నెలల చిన్నారి అనూషకు కడుపులో నొప్పివచ్చింది. గ్రామస్తులు ఆశా కార్యకర్తలకు సమాచారం ఇవ్వగా... వారు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 వాహనాలు ఖాళీ లేవని బదులిచ్చారు. తాము సమ్మెలో ఉన్నామని బాధితులకు చెప్పలేదు.

పలుమార్లు 108 వాహనం కోసం ఫోన్ చేసినా... ఖాళీ లేదనే చెప్పారు. వాహనం వచ్చాక తమ గ్రామానికి వస్తారని అంతా అనుకున్నారు. రాత్రి వరకు ఎదురుచూశారు. పరిస్థితి విషమించి రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి అనూష మృతి చెందింది. ఉదయం నుంచి 108 వాహనం కోసం ఎదురు చూశామని... చిన్నారి తండ్రి లింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది వ్యవహారశైలిపై చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న విషయం ముందే చెబితే... తాము ఇతర వాహనం ఏర్పాటు చేసుకునేవాళ్లమని అంటున్నారు.

ఇదీ చదవండీ...

చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి

Intro:AP_TPG_08_24_CONSTABLE_MISSING_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) ఓ ఏఆర్ కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. డిపార్ట్మెంట్లో కొందరు తనను మోసం చేశారని అందుకే వెళ్తున్నానని చనిపోవాలని నిర్ణయించుకున్నానని తన గురించి వెతకవద్దని అతను రాసిన లేక కుటుంబ సభ్యులకు లభించడంతో కలకలం రేగింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో చోటు చేసుకుంది. ఏలూరులోని ఫిరంగుల దిబ్బ లో నివాసముంటున్న పైడిపాటి హనుమంతరావు భార్య నాగమణి పిల్లలు ఉన్నారు. ఇతను జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ కన్సుమర్ స్టోరీ ఇన్ చార్జిగా పని చేస్తున్నాడు ఈ క్రమంలో లో ఈ నెల 22న సాయంత్రం స్టోర్ కి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్లారు. తర్వాత భార్యకు ఫోన్ చేశారు. రాజమహేంద్రవరం వెళ్తున్నారని ఎవరు అడిగితే స్టోర్ కు వెళ్లారని చెప్పమన్నారు. ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లో పరిశీలించగా ఒక ఉత్తరం దొరికింది డిపార్ట్మెంట్లో కొంతమంది నన్ను మోసం చేశారని చనిపోవాలని నిర్ణయించుకున్నానని నాకోసం వెతకవద్దని అందులో ఉంది. కానిస్టేబుల్ భార్య నాగమణి నీ విషయం పై త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Body:న

Conclusion:న
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.