క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో నోరూరించే... కేక్ మిక్సింగ్ సందడి విశాఖ డాల్ఫిన్ హోటల్లో మొదలైంది. కోలాహలంగా ప్రారంభమైన ఈ కేక్ మిక్సింగ్‌లో... సిబ్బంది సందడి చేశారు. పలు రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ కేక్ మిక్సింగ్‌లో వాడారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ హోటల్ షెఫ్ మాట్లాడుతూ... వైన్‌తో కలిపి మిక్స్ చేసే డ్రైఫ్రూట్స్, నట్స్ మిక్సింగ్ చల్లని ప్రదేశంలో భద్రపరుస్తారని తెలిపారు. 45 రోజుల పాటు భద్రపరిచిన ఈ మిక్స్‌ను కేక్‌లా తయారుచేస్తామని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా హోటల్‌కు వచ్చేవారిని ఇస్తామని వివరించారు.
ఇదీ చదవండి : 'పర్యటక ప్రదేశాల వివరాలకు చిరునామా... విశాఖ టూరిజం ఎక్స్పో'