ETV Bharat / state

సంక్రాంతికి సొంతూరికి పయనం.. కిటకిటలాడుతోన్న రైల్వే, బస్ స్టేషన్లు

సంక్రాంతి పండుగకు ప్రజలంతా తమ ఊళ్లకు వెళ్తుండటంతో ప్రధాన పట్టణాల్లో రైల్వే, బస్​ స్టేషన్లు​ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అదనపు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరగకుండా రైల్వే పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Bustard and railway station with rush for travelers
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్​
author img

By

Published : Jan 12, 2020, 6:17 PM IST

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్లు

సంక్రాంతి పండుగ సందర్బంగా బస్టాండ్​, రైల్వేస్టేషన్ల​లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ప్రధాన పట్టణాల్లో స్థానికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలులో జనరల్ బోగి వద్ద ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఒక్కొక్కరిని సీట్ల వద్దకు పంపిస్తున్నారు. ఈ పద్ధతి పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా రైల్వే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు

Intro:Ap_Vsp_91_12_01_Bus_Trains_Rush_Vo_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్, రైల్వేస్టేషన్ లు కిటకిటలాడుతున్నాయి.

Body:బస్సు, రైళ్లలో సీటు దొరికితే చాలు పండగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావడంతో వచ్చిన రైళ్ళు, బస్సులు.. వచ్చినట్టే కిక్కిరిసి వెళ్తున్నాయి. ప్లాట్ ఫామ్ లపై ఏమాత్రం రద్దీ తగ్గడం లేదు.

Conclusion:ఎన్ని బస్సులు వేసినా సరిపోవటం లేదని అధికారులు చెబుతున్నారు. సీట్లు దొరకక పిల్లాపాపలతో వచ్చినవారు తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. కొన్ని రైళ్లలో టాయిలెట్లలో కూడా కూర్చొని ప్రయాణం సాగించేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయలుదేరే ప్రతి రైలుకు జనరల్ బోగి వద్ద ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఒక్కొక్కరిని సీట్లవద్దకు పంపిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా చొరబాట్లను నియంత్రించడంతో పాటు తొక్కిసలాటకు ఆస్కారం కూడా ఉండదని వారు భావిస్తున్నారు. ఈ పద్ధతి పట్ల రైలు ప్రయాణీకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.