భారత్- అమెరికా రక్షణ దళాల సంయుక్త విన్యాసాలకు వేదికగా నిలవనున్న టైగర్ ట్రంప్-2019కి రంగం సిద్ధమైంది. విపత్తు స్పందన, మానవీయ సహాయ శాఖలు విన్యాసాలు నిర్వహిస్తాయి. రెండు దేశాల పదాతి, నౌకా, వాయుసేనల సిబ్బంది ఇందులో పాలుపంచుకోనున్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకూ విశాఖ, కాకినాడ కేంద్రాలుగా జరగబోయే ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన 1700 మందికిపైగా సైనికులు పాల్గొననున్నారు. భారత నౌకాదళం నుంచి జలాశ్వ, ఐరావత్, సంధ్యాక్ యుద్ధనౌకలు పాల్గొంటాయి. అమెరికా నౌకాదళానికి చెందిన జర్మన్ టౌన్ యుద్ధ నౌక ఈ విన్యాసాల కోసం విశాఖకు వచ్చింది.
భారత పదాతి దళం నుంచి 19 మద్రాస్, 7 గార్డ్స్ పటాలాలకు చెందిన సైనికులు హాజరవుతున్నారు. విశాఖలో హార్బర్ దశ రేపటి నుంచి 16 వరకు సాగుతుంది. ఈనెల 14 న సంయుక్త ఫ్లాగ్ పరేడ్, మీడియా ముఖాముఖి ఉంటాయి. శిక్షణా సంబంధ కార్యక్రమాల్లో ఉభయ దళాలకు చెందిన సైనికులు సాంకేతిక అంశాలల్లో పరస్పరం చర్చలు జరపనున్నారు.
ఇదీచదవండి