హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన మరింత పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... ప్రముఖ వైద్యుడు కూటికుప్పల సూర్యారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులు, నివారణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని కూటికుప్పల సూర్యారావు ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి...స్వప్నకు శస్త్రచికిత్స.. పరామర్శించిన బాలకృష్ణ