విశాఖలో ఓ విశ్రాంత ఉద్యోగి ఇంటిలో దొంగతనానికి పాల్పడిన రామారావు అనే వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. సత్యనారాయణ అనే విశ్రాంత చార్టెర్డ్ అకౌంటెంట్ ఇంటిలో కొద్దినెలల క్రితం రామారావు డ్రైవర్గా పని చేసేందుకు చేరాడు. వృద్ధ దంపతులకు ఇంటిపనిలో సాయం చేస్తూ ఉండే రామారావు.. వారి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదుపై అతని కన్ను పడింది. సత్యనారాయణ, అతని భార్య నిద్రిస్తున్న సమయంలో తాళాలు చేజిక్కించుకుని... చిన్న లాకర్లో ఉన్న 280 గ్రాములు బంగారు ఆభరణాలు, 4 లక్షల 59 వేల రూపాయల నగదును చోరీ చేసినట్లు విశాఖ డీసీపీ ఉదయ్ కుమార్ బిల్లా వెల్లడించారు. నిందితుడి నుంచి 21 తులాల బంగారాన్ని, 4లక్షల 49 వేల రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు.
ఇదీ చదవండి: