విశాఖ మన్యంలో సరైన రహదారులు లేక గర్భిణులకు డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. చింతపల్లి మండలంలో కుడుముసారెకు చెందిన కొర్రా సంధ్యకు నెలలు నిండగా.. పురిటి నొప్పులు ఎదుర్కొన్న సందర్భంలో డోలీనే దిక్కయ్యింది. ప్రసవం కోసం ఈమెను లోతుగెడ్డ ఆసుపత్రికి చేర్చాలంటే సుమారు పది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. ఈ మార్గంలో.. వంతెన నిర్మాణ పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. తాత్కాలిక రాకపోకల కోసం ఏర్పాటు చేసిన కల్వర్టులూ.. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సంధ్యను కొద్ది దూరంపాటు ఆమె కుటుంబీకులు డోలీలో మోసుకువెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించగా.. ప్రసవం అనంతరం తల్లీబిడ్డా క్షేమమని వైద్యాధికారి రామనాయక్ చెప్పారు. రహదారి సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: