రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆరోజు మంత్రులెవ్వరూ ఉండకపోవచ్చని తెలుస్తోంది. తొలుత జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసి.. జూన్ మొదటివారంలో 18 నుంచి 20 మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశమున్నట్లు సమాచారం. కొద్దినెలల తర్వాత జరిగే విస్తరణతోనే పూర్తిస్థాయి మంత్రి వర్గం ఏర్పాటవుతుందని పార్టీలోని ఉన్నత స్థాయి వర్గాల వారు చెప్తున్నారు.
ఇవీ చదవండి..